ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ సినిమా కాదన్న సమంత

ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ సినిమా కాదన్న సమంత

Published on Jun 26, 2014 11:51 AM IST

Samantha1

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల సమంత త్వరలో మరో మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాని, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ట్వీట్ వేసింది. దాంతో మీడియాలో కొంతమంది ఆ మల్టీ స్టారర్ ఎన్.టి.ఆర్ – నాగార్జున కలిసి చేయనున్న సినిమా అంటే, కొంతమంది పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి చేస్తున్న ‘గోపాల గోపాల’ అని అంటున్నారు.

ఈ వార్తలకి సమంత తన ట్విట్టర్ ద్వారా తెరదించింది. ‘ నేను చెప్పిన మల్టీ స్టారర్ ఎన్.టి.ఆర్ – నాగార్జున మూవీ లేదా పవన్ – వెంకటేష్ మూవీ అని అంటున్నారు. కానీ నేను చెప్పిన మల్టీ స్టారర్ మూవీస్ అవి కావు. అసలు సినిమా ఏంటనేది త్వరలో తెలియజేస్తానని’ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం సమంత తెలుగులో ‘రభస’, ‘అల్లుడు శీను’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాల్లో నటిస్తుంటే తమిళంలో ‘అంజాన్’, ‘కత్తి’ సినిమాలో నటిస్తోంది.

sam

తాజా వార్తలు