
స్వతహాగా తమిళ అమ్మాయి, కానీ ఫస్ట్ బిగ్గెస్ట్ బ్రేక్ మరియు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నది మాత్రం తెలుగులో, అంతే కాకుండా ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంత. సమంత ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది. సమంత కెరీర్లోనే ఎక్కువ రిస్క్స్ చేసి చేస్తున్న సినిమా ’10 ఎంద్రాకుల్ల’. సమంత ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా నటిస్తోంది. ఈ భామ ఈ సినిమాలో తనకు విక్రమ్ చేసిన హెల్ప్ గురించి చెబుతూ విక్రమ్ ని తెగ పొగిడేస్తుంది.
ముఖ్యంగా ఈ సినిమా కోసం నేపాల్ లో షూటింగ్ చేసేటప్పుడు ప్రతి రోజూ ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యేదట. కానీ విక్రమ్ ఇచ్చిన సపోర్ట్, కేరింగ్ తనకి చాలా హెల్ప్ అయ్యిందట. అంతే కాకుండా ఏ హీరో హీరోయిన్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ విక్రమ్ అలా కాదు, ఆ విషయంలో తనకి స్పెషల్ థాంక్స్ చెప్పాలని సమంత అంటోంది. అలాగే ‘విక్రమ్ నాకో ఫ్రెండ్స్ మరియు తనంటే నాకెంతో గౌరవం కూడా. నా ఐదేళ్ళ కెరీర్లో ఇంత స్ఫూర్తినిచ్చిన మరియు సినిమా అంటే ఇంత ఫాషన్ ఉన్న వ్యక్తిని చూడలేదని’ సమంత విక్రమ్ ని తెగ పొగిడేసింది. ఈ సినిమా సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

