ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ చేసిన సమంత.. లాంగ్ లీవ్ తీసుకుంటున్నట్లు వెల్లడి..!

ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ చేసిన సమంత.. లాంగ్ లీవ్ తీసుకుంటున్నట్లు వెల్లడి..!

Published on Jun 24, 2026 9:01 PM IST

samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో సమంత తన అభిమానులకు ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. తాను గర్భవతి అనే విషయాన్ని ఆమె అధికారికంగా ధృవీకరించింది.

ఇటీవల బేబీ బంప్‌తో సామ్ కనిపించడంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, తాజాగా ఆమె కన్ఫమ్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ఆమె తెలిపింది.

జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న సమంతకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు