“ఫ్యామిలీ మ్యాన్ 2” కోసం సామ్ భారీ రెమ్యునరేషన్ ఛార్జ్.!

Published on Jun 9, 2021 6:20 pm IST

ఇప్పుడు మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ చాలా మందే సినిమాలతో పాటుగా ఓటిటిలోకి అడుగు పెట్టి తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఓటిటి లో ఎంట్రీ ఇచ్చి ఓవరాల్ ఇండియా వైడ్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2”.

ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి ఉన్న ఈ సిరీస్ చాలా హైప్ తో ముందుకొచ్చిందది.. ముఖ్యంగా సామ్ ఈ సిరీస్ లో ఉంది అందులోని ఇంటెన్స్ విలన్ రోల్ లో నటిస్తుంది టాక్ రాగా ఈ సిరీస్ పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే సినిమాలతో సంబంధమే లేకుండా పూర్తిగా సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇచ్చిన సామ్ చాలానే కష్టపడింది.

మరి ఆ కష్టానికి తగ్గట్టే ఆమెకు భారీ రెమ్యునరేషన్ ముట్టినట్టు తెలుస్తుంది. జెనరల్ గా సినిమాలకు అయితే రెండు కోట్లు ఛార్జ్ చేసే సామ్ ఈ ఒక్క సిరీస్ కే 4 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇది పక్కన పెడితే ఈ సిరీస్ తర్వాత నుంచి మరిన్ని ఇలాంటి ఇంటెన్స్ పాత్రలు సామ్ నుంచి మనం ఆశించొచ్చని చెప్పాలి.

సంబంధిత సమాచారం :