నాగ్, నాని సినిమాలో సమంత ?

15th, February 2018 - 04:48:06 PM

నాగార్జున, నానిలు చేస్తోన్న మల్టీ స్టారర్ సినిమా ఈనెల 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ పై సోషల్ మీడియాలో రోజుకో పేరు వినిపిస్తోంది. అయితే తాజాగా సమాచారం మేరకు సమంత ఈ సినిమాలో నానికి జోడిగా నటించబోతోందని సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న చిత్ర యూనిట్ త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించే అవకాశం ఉంది.

సమంత నటించిన తాజా సినిమా ‘రంగస్థలం’ మార్చి 30 న విడుదలకానుంది. ఈ సినిమా తరువాత ‘మహానటి’ విడుదలకానుంది. ముందుగా మార్చి 29న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించారు కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమా ఒక నెల వెనక్కు పోవచ్చని అంటున్నారు. ఇవి కాకుండా సమంత మరో రెండు కొత్త సినిమాలకు కమిట్ అయ్యింది. కన్నడలో మంచి విజయం సాధించిన ‘యు టర్న్’ సినిమాలో ఈ హీరోయిన్ నటిస్తోంది. పవన్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.