వైరల్ అవుతోన్న సమంత ఫేవరెట్‌ పిక్స్‌ !

Published on Apr 24, 2019 3:00 am IST

చై – సామ్ కి ఇటు రీల్ లైఫ్ లో ‘మజిలీ’ రూపంలో మంచి హిట్ రావడంతో, అటు రియల్ లైఫ్ లో కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. తమ నిజ జీవిత ‘మజిలీ’లోని కొన్ని మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తన ఫేవరెట్‌ పిక్స్‌ ను అభిమానులతో పంచుకుంది సామ్.విక్టరీ వెంకటేష్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం గత నెలలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వేడుకలో చైతన్య-సమంత దిగిన కొన్ని ఫోటోలను సమంత ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

సమంత పోస్ట్ చేస్తూ ‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే నా శ్రీవారు జీవితాంతం అలాగే ప్రశాంతంగా బతకాలని ఆశపడ్డారు. కానీ దేవుడు మాత్రం నన్ను పంపించి ప్రతీకారం తీర్చుకున్నాడు’ అని చైతన్యను ఉద్దేశించి రాసి.. దానికి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. సమంత పోస్ట్ చేసిన ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతూ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :