ఇంటర్వ్యూ: సమంత – ‘శుభం’ మూవీకి మంచి డేట్ దొరికింది.. అందరికీ నచ్చుతుంది!

ఇంటర్వ్యూ: సమంత – ‘శుభం’ మూవీకి మంచి డేట్ దొరికింది.. అందరికీ నచ్చుతుంది!

Published on May 7, 2025 1:00 AM IST

ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో సమంత మీడియాతో ముచ్చటించారు.

* నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది.

* ‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా సీరియల్ గురించి ఉంటుంది.. ఆ సీరియల్‌లో శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇక నా ప్రొడక్షన్ కంపెనీకి ట్రాలాలా అని పెట్టడానికి కూడా కారణం ఉంది. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ట్రాలాలా అని పెట్టాం.

* ఎన్నో కలలు కంటూ సినిమా పరిశ్రమలోకి వస్తారు. మా చిత్రం కోసం శ్రియా, శ్రావణి, షాలినీలు ఎంతో కష్టపడ్డారు. నా సినిమాలో నటించిన వారందరినీ చూస్తే నా పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి.

* ‘శుభం’ చిత్రానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాం. సినిమా చూస్తే అందరికీ ఆ విషయం అర్థం అవుతుంది. తక్కువ పెట్టలేదు. అలా అని ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ప్రతీ సినిమాకు, కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

* ప్రస్తుతం నేను ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని చేస్తున్నాను. జూన్ నుంచి మళ్లీ షూట్‌కు వెళ్తున్నాం. షూట్ స్టార్ట్ అయ్యాక మళ్లీ అప్డేట్లు వస్తుంటాయి. అట్లీ గారితో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. భవిష్యత్తులో మేం ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి.

* ‘శుభం’ చిత్రానికి వసంత్ కథను అందించారు. ఈ మూవీ చూసిన తరువాత ప్రతీ ఒక్క ఆడియెన్స్ మీద ప్రభావం చూపించాలని కోరుకున్నాను. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఇది జనరల్ హారర్, కామెడీ అనేలా మాత్రం ఉండదు. సోషల్ సెటైర్ ఉంటుంది కానీ.. మెసెజ్ ఉంటుందా? లేదా? అన్నది మీరే (ఆడియెన్స్) తెలుసుకోండి.

* ‘శుభం’ చిత్రానికి మంచి డేట్ దొరికింది. మే 9 అనేది సమ్మర్ హాలీడేస్‌లో ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు వీలుంటుంది. మంచి డేట్ దొరకడం మా అదృష్టం. క్లింటన్ సెరెజో సంగీతం బాగుంటుంది. పాత కాలానికి తీసుకు వెళ్లేలా పాటలు ఉంటాయి. వివేక్ సాగర్ బీజీఎం అందరినీ ఆకట్టుకుంటుంది. మే 9న రిలీజ్ అవుతున్న మా ‘శుభం’ సినిమాని అందరూ చూసి సక్సెస్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు