
మళయాలంలో ఘన విజయం సాధించిన ‘బెంగళూరు డేస్’ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మళయాల వర్షన్‌లోని మ్యాజిక్‌ను ఈ తమిళ వర్షన్‌లోనూ రిపీట్ చేసేందుకు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పకడ్బందీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్య, రానా, బాబీ సింహా, శ్రీ దివ్యలు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా స్టార్ హీరోయిన్ సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
మళయాలంలో నిత్యామీనన్ పోషించిన పాత్రను తమిళంలో సమంత పోషిస్తున్నారు. ఈమధ్యే సమంత తన పోర్షన్‌ను పూర్తి చేసేందుకు బెంగళూర్ డేస్ టీమ్‌తో జాయిన్ అయ్యారు. హీరో రానాకు జోడీగా సమంత ఓ చిన్న ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. సమంత, రానాలు పాల్గొంటుండగా ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పీవీపీ సంస్థ పెద్ద ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక తెలుగులో బెంగళూర్ డేస్ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

