మన్మథుడు 2 షూటింగ్ లో జాయిన్ అయిన స్టార్ హీరోయిన్ !

Published on May 1, 2019 4:03 pm IST

ఇటీవల మజిలీ తో సూపర్ హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ప్రస్తుతం మన్మథుడు 2 షూటింగ్ లో పాల్గొంటుంది. చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం గత కొద్దీ రోజులనుండి పోర్చుగల్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో నటిస్తుంది. దాంతో ఆమె నిన్నటి నుండి షూటింగ్ లో పాల్గొంటూ తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో వుంది.

చైతన్ భరద్వాజ్ సంగీతంఅందిస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More