“ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ లో థ్రిల్ చేస్తున్న సమంత.!

Published on May 19, 2021 11:08 am IST

ప్రస్తుతం గత కొన్నాళ్ల నుంచి ఇండియన్ మూవీ లవర్స్ సహా ఓటిటి వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “ది ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ ట్రైలర్ ను ప్రైమ్ వీడియో వారు విడుదల చేసారు. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈసారి సీజన్ పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ను చూస్తే ఒకింత ఇంట్రెస్ట్ గాను మంచి ఇంటెన్స్ గాను కనిపిస్తుంది.

అయితే ఈ సిరీస్ లో మొదటి నుంచీ హైలైట్ రోల్ మనోజ్ భాజ్ పై చేసే శ్రీకాంత్ రోల్ ఈసారి తన రోల్ కొత్త ప్లాట్ ఫామ్ లో కనిపిస్తుంది. ఓ చిన్నపాటి ఉద్యోగిని అని చెప్పి అండర్ కవర్ ఏజెంట్ గా దేశాన్ని కాపాడే శ్రీకాంత్ రోల్ ఈసారి దర్శకులు కొత్తగా డిజైన్ చేశారు. అలాగే గత సీజన్లో లానే తన రోల్ పై మంచి ఫన్ ఎపిసోడ్స్ కూడా డిజైన్ చేసారు.

కాకపోతే తన రోల్ నుంచి మంచి యాక్షన్ ను ఆశించిన వారికి మాత్రం ఈ ట్రైలర్ డిజప్పాయింట్ చేస్తుంది. కానీ సమంతా రోల్ కోసం స్పెషల్ గా చెప్పి తీరాల్సిందే. అసలు ఊహించని విధంగా సామ్ ఈ సిరీస్ లో కనిపిస్తుంది. తన పాత్ర కానీ ఆమె లుక్స్ కానీ యాక్షన్ కానీ చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇవి మాత్రం సామ్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తాయని చెప్పాలి.

అలాగే ఈసారి దర్శకులు రాజ్ అండ్ డీకే సెటప్ అంతా చెన్నైకి మార్చారు. అలాగే మొదటి సీజన్ కు దీనికి లింకప్ అయ్యి ఉన్నట్టుగా కూడా ఎక్కడా సన్నివేశాలు కనిపించలేదు అది మరో ప్రశ్నార్ధక అంశం. సో ఇదంతా కొత్తగా ఉంది. మరి ఈ పూర్తి సీజన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే జూన్ 4 వరకు ఆగాల్సిందే. మొత్తానికి మాత్రం సామ్ రోల్ ఈ సిరీస్ లో బాగా హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :