టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ చిత్రానికి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్ర కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతోంది. దీంతో ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్స్ ఇంత తక్కువ సమయంలో రావడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర సినిమా కూడా పోటీలో లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.


