అక్కడ సాలిడ్ స్టార్ట్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..!

అక్కడ సాలిడ్ స్టార్ట్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..!

Published on Jun 20, 2026 10:30 AM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో, లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విభిన్నమైన కథాంశంతో, ఒక హౌస్‌వైఫ్ వెనుక ఉన్న యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 550K డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సాలిడ్ స్టార్ట్ అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక వీకెండ్‌లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో సామ్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు అందించిన అద్భుతమైన కథకు, సంతోష్ నారాయణన్ అందించిన మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవడంతో థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ట్రలాలా పిక్చర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు