తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా హీరోలదే డామినేషనా అంటే అందుకు లేదనే సమాధానం తరాల నుంచి ఉంది. అలా ఇప్పుడు ట్రెండీ సమయంలో కూడా పలువురు హీరోయిన్స్ తమదైన మార్కెట్ ని టాలీవుడ్ లో ఏర్పరచుకొని భారీ నంబర్స్ బాక్సాఫీస్ దగ్గర సెట్ చేస్తున్నారు.
అయితే ఈ లిస్ట్ లో అనుష్క, సమంత ఇంకొందరు బ్యూటీస్ ఉన్నారు. వీరిలో సమంత మాత్రం ఊహించని రికార్డులు టాలీవుడ్ దగ్గర సెట్ చేసింది. ఆమె నటించిన సెన్సేషనల్ హిట్ “మా ఇంటి బంగారం” సినిమా ఇప్పుడు ఏకంగా 100 కోట్ల గ్రాస్ కి దగ్గరలో వస్తుంది.
మొత్తం 18 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇపుడు 96 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. దీనితో 100 కోట్ల మార్క్ కి సినిమా దాదాపు చేరుకునే ఛాన్స్ లేకపోలేదని చెప్పొచ్చు. ఇన్ని రోజులు అయినా కొత్త సినిమాలకి ధీటుగా మా ఇంటి బంగారం నిలిచింది. సో లాంగ్ రన్ లో 100 కోట్ల మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉంది.
‘అరుంధతి’, ‘మహానటి’ రికార్డులు బద్దలు..
టాలీవుడ్ సినిమా దగ్గర ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో స్వీటీ అనుష్క శెట్టి నటించిన సెన్సేషనల్ హారర్ హిట్ చిత్రం ‘అరుంధతి’ 2009 లోనే 70 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి సంచలనం నమోదు చేసింది. అక్కడ నుంచి మళ్ళీ 2018లో కీర్తి సురేష్ నటించిన మహానటి 80 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాకపోతే ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లోని తెరకెక్కి రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ సమంత మా ఇంటి బంగారం సినిమా మాత్రం ఈ రెండు సినిమాలని క్రాస్ చేసి 97 కోట్ల దగ్గర గ్రాస్ కి చేరుకుంది.
100 కోట్లతో టాలీవుడ్ లో మొదటి హీరోయిన్ గా సామ్ ఖాతా తెరుస్తుందా?
ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు చాలా సాధారణం అయ్యిపోయాయి. కానీ ఒకప్పుడు గ్రాస్ కి ఒక క్లబ్ అని షేర్ కి ఒక క్లబ్ అని హీరోలని ఆయా కోణాల్లో ఫ్యాన్స్ డివైడ్ చేసుకున్నారు. కానీ ఫైనల్ ఈ ట్రెండ్ హీరోయిన్స్ కి వచ్చేసరికి సమంత 100 కోట్ల క్లబ్ ని టాలీవుడ్ కి హీరోయిన్స్ వెర్షన్ లో పరిచయం చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మార్క్ ని అందుకుంటే టాలీవుడ్ లో మొదటి 100 కోట్ల గ్రాస్ ఉన్న హీరోయిన్ గా చరిత్ర సృష్టించినట్టే అని చెప్పాలి. ఇప్పుడు సినిమా దాదాపు రన్ పూర్తి చేసుకోవస్తుంది. సో చూడాలి మా ఇంటి బంగారం ఆ మార్క్ కొడుతుందో లేదో అనేది.


