ట్రేడ్ టాక్: అప్పుడే బ్రేకీవెన్ కొట్టేసిన సామ్ సినిమా!?

ట్రేడ్ టాక్: అప్పుడే బ్రేకీవెన్ కొట్టేసిన సామ్ సినిమా!?

Published on Jun 20, 2026 10:01 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రమే మా ఇంటి బంగారం. డీసెంట్ బజ్ నడుమ విడుదల అయ్యిన ఈ సినిమా ట్రేడ్ ఊహించని ఓపెనింగ్స్ ని రాబట్టి షాకిచ్చింది. ఇలా మొదటి రోజుకే 6 కోట్లకి పైగా షేర్ ని రాబట్టినట్టు పి ఆర్ నంబర్స్ చెబుతుండగా ఇప్పుడు సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టుకున్న టార్గెట్ ని కేవలం ఈ రెండే రోజుల్లో కొట్టేసినట్టు తెలుస్తోంది.

దాదాపు 10 నుంచి 11 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో దిగిన మా ఇంటి బంగారం అందులో సగానికి పైగా మొదటి రోజే రికవర్ చేసేసింది. పైగా రెండో రోజు కూడా స్ట్రాంగ్ బుకింగ్స్ ఉండేసరికి ఈజీగా ఈ రెండో రోజు తోనే టార్గెట్ రీచ్ అయిపోతుంది అని సినీ వర్గాల్లో టాక్. సో సమంత కెరీర్ లో అలానే ఈ ఏడాది టాలీవుడ్ లో మరో క్లీన్ హిట్ పడిపోయినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు అలాగే సామ్ నిర్మాణం కూడా వహించింది.

తాజా వార్తలు