శనివారం నాడు అందరూ సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే అందాల తార.. ప్రముఖ హీరోయిన్ సమంత మాత్రం స్వచ్ఛ భారత్ అంటూ సమాజ సేవలో పాల్గొంది. యువ హీరో రామ్ సవాల్ కు స్పందించిన సమంత… స్వచ్ఛ భారత్ కాంపెయిన్ లో పాల్గొంది. హైదరాబాద్ లోని ఒక ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలను, రహదారులను శుభ్రం చేశారు. అనంతరం మరొక అగ్ర హీరోయిన్ త్రిషను స్వచ్ఛ భారత్ కాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా నామినేట్ చేసింది. స్వచ్ఛ భారత్ ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగించింది.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుంది. మరోవైపు సత్యదేవ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.


