సమంత ఆ భారీ అవకాశాన్ని వదులుకుందా ?

Published on Jun 21, 2021 5:00 pm IST

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈమధ్య సినిమాల కౌంట్ బాగా తగ్గించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ చిత్రాలను పక్కనబెట్టి స్టోరీ బేస్డ్ చిత్రాలకు మాత్రమే సైన్ చేస్తోంది. ఇటీవల ఆమె చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ సాధించింది. అందులో సమంత నటనను చాలా మంచి మార్కులే పడ్డాయి. మొదట్లో ఆమె మీద విమర్శలు చేసిన వాళ్ళు సైతం తరువాత ప్రశంసలు కురిపించారు. ఈ వెబ్ సిరీస్ కారణంగా సమంత పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఒక్కసారిగా ఆమెకు ఆఫర్లు పెరిగాయి. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ చేయాలనుకునే చాలామంది సమంతను అప్రోచ్ అవుతున్నారు.

అలా సమంత వద్దకు వచ్చిన ఆఫర్లతో నెట్ ఫ్లిక్స్ నిర్మించదలచిన ‘బాహుబలి-బిఫోర్ ది బిగినింగ్’ కూడ ఉందని టాక్. ఈ వెబ్ సిరీస్ ప్లానింగ్ ఇప్పటిది కాదు పాతదే. దీన్ని దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయాల్సింది. కానీ నెట్ ఫ్లిక్స్ నటీనటులతో సహా టీమ్ మొత్తాన్ని మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే టైటిల్ రోల్ అయిన శివగామి పాత్ర కోసం సమంతను సంప్రదించారని కానీ సమంత మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాబట్టి పారితోషకం దగ్గర పేచీ వచ్చే అవకాశం చాలా తక్కువ. మరి ఏ కారణం చేత సమంత ఈ అవకాశాన్ని వదులుకుందో మరి.

సంబంధిత సమాచారం :