సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడుతూ.. ‘ఈ ఒక్క సినిమాను ప్రాణం పెట్టి చేశాం. థియేటర్లలో దీని సక్సెస్ రేంజ్ మామూలుగా ఉండదు’ అంటూ సినిమాపై తనకున్న గట్టి నమ్మకాన్ని వ్యక్తపరిచింది.
నిర్మాతగా మారడంపై స్పందిస్తూ.. గడిచిన ఐదు రోజులుగా ప్రొడ్యూసర్‌కు ఎంత స్ట్రెస్ ఉంటుందో తనకు పూర్తిగా అర్థమైందని సమంత తెలిపింది. సినిమా హిట్ అయితే వచ్చే క్రెడిట్ అంతా నటీనటులకే వెళ్తుందని.. కానీ రాత్రింబవళ్లు కష్టపడి పని చేసే తెరవెనుక టెక్నీషియన్ల కష్టాన్ని గుర్తించి వారికి థాంక్స్ చెప్పడానికే తాను ఈ స్టేజ్ వాడుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా వారం రోజులుగా నిద్ర లేకుండా పనిచేసిన ఏడీలు, టెక్నీషియన్లతో పాటు తనకు సపోర్ట్‌గా నిలిచిన నందినీ రెడ్డి, హిమాంక్, రాజ్ అండ్ డీకే, మ్యూజిక్ డైరెక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ లీ విటకర్ అందించిన యాక్షన్ సీన్స్ సినిమాలో మేజర్ హైలైట్ అని చెప్తూ, మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న తన చిత్రాన్ని ఆదరించాలని అభిమానులను కోరింది.


