సమంత స్టార్ట్ చేసిన మరో మిషన్

సమంత స్టార్ట్ చేసిన మరో మిషన్

Published on Nov 5, 2015 11:34 AM IST

Samantha
సౌత్ ఇండియాలోని స్టార్ హీరోస్ తో వరుస బెట్టి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సౌత్ టాప్ హీరోయిన్ సమంత. చాలా కాలం క్రితమే మనకు ఇంట ఇచ్చిన సమాజం కోసం మనవంతుగా ఏదో ఒకటి చేయాలి అని భావించిన సమంత ప్రత్యూష ఫౌండేషన్ ని స్థాపించి దాని ద్వారా చాలా మంది అనారోగ్యులకు సాయం చేయడమే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాలు కూడా చేసింది. తాజాగా సమంత మరో సోషల్ కాస్ కోసం ఉండుకు వచ్చింది. అన్ని దానాలలో కల్లా అవయవదానం గొప్పది అంటారు. ఎందుకంటే మనం చనిపోయినా మన అవయవాలు మాత్రం బతికే ఉంటాయి.

తాజాగా సమంత తన అవయవాలను దానం చేసి, తన అభిమానులు కూడా అవయవదానం చేయాలని పిలుపునిచ్చింది. అలాగే అవయవదానం పై అవేర్నెస్ తీసుకురావడానికి కూడా సిద్దమైంది. అందులో భాగంగా ప్రత్యూష ఫౌండేషన్ వారు మాక్స్ క్యూర్ హాస్పిటల్స్ – జీవన్దాన్ తో కలిసి నవంబర్ 7న ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయనుంది. ఈ ఈవెంట్ నినాదం ‘డోంట్ జస్ట్ లైవ్ ఇన్ వన్ లైఫ్’. దీని ద్వారా అందరిలోనూ అవయవదానం చేయాలనే స్పూర్తిని నింపి మన అవయవాలను ఎప్పటికి బతికి ఉంచేలా చూడనున్నారు.

తాజా వార్తలు