‘రంగస్థలం’ ముందు చరణ్ ‘రంగస్థలం’ తర్వాత చరణ్ అంటారు – సమంత

28th, March 2018 - 10:04:54 AM

రామ్ చరణ్ కెరీర్లోనే భిన్నమైనదిగా చెప్పబడుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంలో వినికిడి లోపంతో కనిపించనున్న చరణ్ చాలా బాగా నటించారనే కాంప్లిమెంట్స్ ముందు నుండి వస్తూనే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ చూశాక ప్రేక్షకులు, అభిమానులు కూడ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక చరణ్ సరసన కథానాయకిగా నటించిన సమంత అయితే చరణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, ఆయన గత సినిమాలు వేరు ఈ సినిమా వేరని ఆయన కేరీర్ ను ఇకపై రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అని మాట్లాడుకుంటారని కితాబిచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇంకొక్క రోజులో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వస్తోంది.