మరోసారి బన్నితో సమంత రోమాన్స్..?

మరోసారి బన్నితో సమంత రోమాన్స్..?

Published on Mar 10, 2015 9:28 PM IST

allu-arjun-samantha
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సమంతలు తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే వీరిద్దరూ మరోసారి జంటగా నటించడానికి రెడీ అవుతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించబోయే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేశారు. సమంతతో పాటు మరొక హీరోయిన్ కు కూడా ఈ సినిమాలో స్థానం ఉంది. ఆ అవకాశం ఎవరు సొంతం చేసుకుంటారో..? ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో ప్రేమకథకు మంచి ప్రాముఖ్యత ఉందని దర్శకుడు తెలిపారు.

ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలుపెడతారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎం.రత్నం మాటల రచయిత. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు