మాధవన్ తో సమంత…చాలా ఎక్సయిటెడ్ గా ఫీల్ అవుతుందట.

Published on Jan 16, 2020 8:00 pm IST

టాలీవుడ్ క్వీన్ సమంత ట్విట్టర్ వేదికగా తాను ప్రచార కర్తగా ఉన్న ఓ ప్రొడక్ట్ యాడ్ ను పంచుకున్నారు. జి వి టి గోల్డ్ కప్ టీ ప్రోడక్ట్ కోసం ఆమె నటించిన యాడ్ వీడియో పోస్ట్ చేసిన ఆమె ఏ వి టి బేవరేజ్ ఫ్యామిలీలో భాగమైనందుకు ఎంతో ఎక్సయిటెడ్ గా ఫీల్ అవుతున్నాను అని కామెంట్ పెట్టారు. ఓ యాడ్ కోసం సమంత, మాధవన్ కలిసి పనిచేశారు. డబ్బింగ్ థియేటర్ లో మూడ్ సెట్ కాక ఇబ్బంది పడుతున్న మాధవన్ మూడ్… జి వి టి గోల్డ్ కప్ టీ ఇచ్చి సెట్ చేస్తుంది. సౌత్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న సమంత అనేక ప్రొడక్ట్స్ కి ప్రచార కర్తగా ఉన్నారు.

ఇక సమంత నటించిన 96 తెలుగు రీమేక్ జాను చిత్రం వచ్చే నెల చివరి వారంలో విడుదల కానుంది. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే సమంత సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 లో నటిస్తున్నారు. మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ మాన్ మొదటి భాగం సూపర్ సక్సెస్ అయ్యింది.

సంబంధిత సమాచారం :

X
More