సమంత పూర్తిగా అంకితమైపోయింది

Published on Jun 20, 2019 2:00 am IST

సమంత భిన్నత్వాన్ని కోరుకుంటోంది.. చేస్తే మంచి సినిమాలే చేయాలి లేకుంటే ఇంట్లో కూర్చొవాలి అనే ఫార్ములాను వంటబట్టించుకున్న ఈమె అలా తన దగ్గరకొచ్చే మంచి సినిమాలకు పూర్తిగా అంకితమైపోతున్నారు. తాజగా ఆమె చేసిన చిత్రం ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన పాత్ర సమంతదే. కథ మొత్తం ఆమె మీదే నడుస్తుంది. సమంత క్రేజ్ మూలాన చిత్రంపై జనాల్లో ఆసక్తి పెరిగింది.

సమంత కూడా సినిమాను సీరియస్‌గా తీసుకుని పూర్తి బాధ్యతల్ని భుజాన వేసుకుంది. వేరే పనులేవీ పెట్టుకోకుండా అనునిత్యం సినిమా కోసమే పనిచేస్తున్నారు. డబ్బింగ్ దగ్గర్నుండి అని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రమోషన్స్ అయితే ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటున్నాయి. డిజిటల్ మీడియాలో ఎక్కువగా ఇంటర్వూస్ ఇస్తూ, ట్విట్టర్లో కూడా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు సమంత. జూలై 5న చిత్రం విడుదలకానుండటంతో రానున్న రోజుల్లో ఈ హడావుడి మరింత పెరగనుంది. ఇకపోతే రేపు ఉదయం 10 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More