ఆ ఇద్దరు హీరోలతో సమంత సీక్రెట్ సినిమాలు..?

ఆ ఇద్దరు హీరోలతో సమంత సీక్రెట్ సినిమాలు..?

Published on Aug 15, 2025 1:00 AM IST

samantha

స్టార్ బ్యూటీ సమంత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అయితే, ఆమె ప్రస్తుతం నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, సామ్ తన చరిష్మాను తిరిగి దక్కించుకోవాలని ఆమె ఫ్యాన్స్ బలంగా కోరుతున్నారు. దీనికోసం ఆమె కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

ఇక తన సాలిడ్ కమ్ బ్యాక్ ఏ సినిమాతో ఉంటుందా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. అయితే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్త ఇటీవల సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. కానీ, ఈ వార్తపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, ఈ పాటలో సామ్ దాదాపు కన్ఫమ్‌గా కనిపిస్తుందని ఇప్పుడు తెలుస్తోంది. అందుకే ఈ విషయాన్ని రివీల్ చేయడం లేదని సినీ సర్కిల్స్ న్యూ టాక్.

మరో హీరో కార్తీతో కూడా సమంత ఓ సినిమా చేయబోతుందని తెలుస్తోంది. కార్తీ కెరీర్‌లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా తెరకెక్కనున్న ‘ఖైదీ 2’ సినిమాలో సమంత కూడా నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందనే వార్త మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇలా రెండు సినిమాల్లో సమంత ఎలాంటి సౌండ్ లేకుండానే అభిమానులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతుందా.. అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు