ఎన్టీఆర్ సినిమాలో సమంత కూడానా ?

ఎన్టీఆర్ సినిమాలో సమంత కూడానా ?

Published on Nov 18, 2018 10:42 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్కినేని సమంత కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా సమంత ఏ రోల్ లో నటిస్తోందో అని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన జమున లేదా కాంచన పాత్రల్లో ఏదొక పాత్రలో సమంత నటించబోతున్నట్లు సమాచారం.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు