కింగ్ నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ తెరక్కించనున్న ఈ చిత్రం మార్చి 12న లాంచ్ కానుండగా ,మొదటి షెడ్యూల్ పోర్చుగల్ లో జరుగనుంది. ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ అంతా యూరప్ లో జరుగనుంది. ఇక ఈ చిత్రంలో సమంత అక్కినేని ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారని సమాచారం. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఫై నాగార్జున నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు.


