
తమిళ స్టార్ హీరో విక్రమ్, సమంతలు హీరో హీరోయిన్లుగా తమిళంలో ఓ రోడ్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకుడు. ఓ సరికొత్త కథతో రూపొందుతోన్న ఈ సినిమాకు ’10 ఎంద్రకుల్ల’ అనే టైటిల్ ప్రకటించిన రోజునుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
’10 ఎంద్రకుల్ల’ అంటే ‘పది లెక్కపెట్టేలోపు’ అని అర్థం. పేరులోనే మంచి థ్రిల్‌ను నింపుకున్న ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ సీట్లకు అతుక్కుపోయేలా కూర్చోబెడుతుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకూ రకరకాల ప్రచారాలు కొనసాగగా తాజాగా అక్టోబర్ 2ను విడుదల తేదీగా ప్రకటించారు. ‘ఐ’ సినిమా తర్వాత విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి.

