రానా పెళ్ళిలో సందండంతా సమంతదే..!

Published on Aug 9, 2020 10:47 am IST

నిన్న దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్ తో ఘనంగా వివాహం జరుపుకున్నారు. రామానాయడు స్టూడియోలో ఘనంగా ఈ వేడుక జరుగగా, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక సోషల్ మీడియా వేదికగా స్టార్స్ రానాకు తమ బెస్ట్ విషెష్ తెలియజేశారు. కాగా అక్కినేని వారి కోడలు సమంత మరియు నాగ చైత్యన్య ఈ వివాహానికి హాజరయ్యారు. నాగ చైతన్య లెజెండ్ రామానాయుడుగారి మనవడన్న సంగతి తెలిసిందే. కాగా ఈ వేడుకలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఖరీదైన డిజైనర్ వేర్ లో సమంత మెరిసిపోయింది. ప్రముఖ డిజైనర్ అర్పిత మెహతా డిజైన్ చేసిన బట్టలతో సమంత ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది. పెళ్ళికి డిజైనర్ శారీలో హాజరైన సమంత అద్భుతంగా ఉంది. ఇక అంతకు ముందు జరిగిన మెహిందీ వేడుకలో సమంత వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ రోజు ఆమె ధరించిన డ్రెస్ ధర అక్షరాల 1.59 లక్షలు అని సమాచారం. ఏమైనా అక్కినేని వారి కోడలు తన స్టేటస్ ఎమిటో నిరూపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More