దర్శకుడు రాజ్ నిడిమోరుతో హీరోయిన్ సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పోస్ట్ వైరల్‌గా మారింది. ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’’ అని ఆమె పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సమంత – రాజ్ నిడిమోరు నేడు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇదే సమయంలో శ్యామాలి ఈ పోస్ట్ పెట్టడంతో చర్చ మొదలైంది. సమంత సమయం దొరికినప్పుడల్లా ఈశా షౌండేషన్‌కు వెళ్లే విషయం తెలిసిందే. దాని వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె తరచూ పాల్గొంటూ ఉంటుంది. కాబట్టి, ఆ ప్రదేశంలోనే తన వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. మొత్తానికి సమంత – రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పెళ్లి అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.



