సమంత పెళ్లంటూ ప్రచారం.. ఆమె పోస్ట్ వైరల్ !

Desperate people do despera

దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో హీరోయిన్ సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు దర్శకుడు రాజ్‌ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్ గా మారింది. సమంత – రాజ్‌ నిడిమోరు నేడు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇదే సమయంలో శ్యామాలి ఈ పోస్ట్‌ పెట్టడంతో చర్చ మొదలైంది. సమంత సమయం దొరికినప్పుడల్లా ఈశా షౌండేషన్‌కు వెళ్లే విషయం తెలిసిందే. దాని వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె తరచూ పాల్గొంటూ ఉంటుంది. కాబట్టి, ఆ ప్రదేశంలోనే తన వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. మొత్తానికి సమంత – రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పెళ్లి అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

Exit mobile version