సామ్ లాంచ్ చేయనున్న ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” సాంగ్!

Published on Jun 16, 2021 11:00 am IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించింది రెండు సినిమాలే అయినా మంచి ఇంపాక్ట్ ను తాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇపుడు తాను హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.

మరి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “పుష్పక విమానం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే సిలకా..అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. యూత్ ను, మాస్ ను ఆకట్టుకున్న ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్.

‘కళ్యాణం’ లిరికల్ సాంగ్ ను ఈ నెల 18న శుక్రవారం ఉదయం 11 గంటలకు స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా వచ్చే ఈ పాటను స్టార్ సింగింగ్ కాంబో గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, సిధ్ శ్రీరామ్, మంగ్లీ పాడారు. రామ్ మిరియాల సంగీతం “పుష్పక విమానం”కు ఓ అస్సెట్ కాబోతోంది అని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో నటీనటులు: ఆనంద్ దేవరకొండ ,గీత్ సైని సహా శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు తదితరులు నటిస్తున్నారు.

అలాగే టెక్నికల్ టీమ్ గా సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి రచన-దర్శకత్వం: దామోదర వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :