శాకుంతలం లో తన పార్ట్ పూర్తి చేసిన సమంత!

Published on Aug 12, 2021 7:44 pm IST

గుణ టీమ్ వర్క్స్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్స్ పతకాల పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రం లో అక్కినేని సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. శాకుంతలం టీమ్ థాంక్ యూ శాకుంతల పేరుతో సమంత కి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో దేవ్ మోహన్, అదితి బాలన్ లతో పాటుగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా (భారత) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :