కోడలు పిల్లతో షూటింగ్ సరదాగా ఉంది : నాగ్

Published on May 21, 2019 6:21 pm IST

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయిక. అక్కినేనివారి కోడలు సమంత అక్కినేని సైతం ఇందులో ఒక అతిథి పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఆమె పాత్ర తాలూకు షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్నే చెబుతూ కోడలు పిల్లతో షూటింగ్ సరదగా ఉందని నాగార్జున ట్వీట్ చేశారు.

నెల రోజుల నుండి జరుగుతున్న పోర్చుగల్ షూట్ ఈరోజే ముగియగా త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ మొదలుకానుంది. హీరో నుండి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More