సమంత “ఓ బేబీ” హిందీ లో కూడా అనువదిస్తున్నారా…!

Published on Jun 3, 2019 6:35 pm IST

సమంత నటిస్తున్న ఓ బేబీ జులై 5న విడుదల కానుంది. కొరియన్ “మిస్ గ్రాని” కి అనువాదమైన ఈ మూవీని లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీని హిందీలో కూడా రీమేక్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

నిర్మాత సురేష్ బాబు అప్పుడే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో చర్చలు మొదలుపెట్టారట. అలాగే సమంత పాత్ర కోసం ఓ బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని వెతికేపనిలో పడ్డారట. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఓ బేబీ మూవీలో సమంత తో పాటు నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, మరియు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు.ఫిక్షనల్ కామెడీ జోనర్లో ఈ మూవీ రానుంది.

సంబంధిత సమాచారం :

More