ఓటిటి సమీక్ష: ‘సంభవం అధ్యాయం ఒన్ను’ – తెలుగు డబ్ టైం లూప్ థ్రిల్లర్ జియో హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష: ‘సంభవం అధ్యాయం ఒన్ను’ – తెలుగు డబ్ టైం లూప్ థ్రిల్లర్ జియో హాట్ స్టార్ లో

Published on Apr 15, 2026 4:40 PM IST

sambavam adhyayam onnu Review

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : ఏప్రిల్ 15, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : జియో హాట్ స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : అస్కర్ అలీ, వినీత్ కుమార్, సిద్ధార్థ్ భరతన్, అసిమ్ జమాల్, సెంథిల్ కృష్ణ, ఫహద్ సిద్ధిక్, శ్రీకాంత్, కనకమ్మ కె మరియు సుపర్ణ
దర్శకుడు : జితు సతీషన్ మంగళత్తు
నిర్మాతలు : ఫరాస్ మహమ్మద్, ఫహద్ సిద్ధిక్, ఫయేజ్ మహమ్మద్
సంగీతం : గాడ్విన్ థామస్
ఛాయాగ్రహణం : నవీన్ నజోస్
ఎడిటింగ్ : అర్జున్ ప్రకాష్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఇటీవల మలయాళ సినిమా నుంచి ఆడియెన్స్ ఎక్కువగా మాట్లాడుకున్న పలు చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా ‘సంభవం అధ్యాయం ఒన్ను’ కూడా ఒకటి. టైం లూప్ కాన్సెప్ట్ లో తెరకెక్కించిన ఈ సినిమా నేడు జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్ లో కూడా వచ్చింది. మరి ఈ మలయాళం థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

కేరళ లోని వెల్లూర్ కాడ్ పోలీస్ స్టేషన్ కి చెందిన సీపీఓ ఆనంద్ (అస్కర్ అలీ) అక్కడే మరో పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. కుటుంబాన్ని వదిలి రావాల్సి వచ్చిన ఆనంద్ అక్కడ పోలీస్ లు అశోకన్ (అసీమ్ జమల్), రెజ్జీ (వినీత్ కుమార్) లతో కలిసి పెరుమాలై పోలీస్ స్టేషన్ కి చెందిన కొందరు పోలీస్ లు ఓ గుర్తు తెలియని అడవిలో చిక్కుకున్నారని తెలిసి వారిని కాపాడడానికి ఆ అడవిలోకి వెళతారు. కానీ అక్కడ నుంచి అడవిలో అంతా వింతగా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆనంద్ తనకి జరిగిన ఘటనే మళ్ళీ మళ్ళీ జరగడాన్ని గ్రహిస్తాడు. దీనితో అక్కడ నుంచి బయటకి పడే మార్గం లేక ఒక టైం లూప్ లో చిక్కుకున్నానని అర్ధం చేసుకుంటాడు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి తాను బయట పడతాడా లేదా? ఇంతకీ ఆ అడవిలో ఏం జరిగింది? దాని వెనుక ఉన్న అమానుష చరిత్ర ఏంటి? ఎందుకు అక్కడ మళ్ళీ జరిగిందే జరుగుతుంది? అందులో చిక్కుకున్నవారు ఎంతమంది? ఈ అంతా బయట పడతారా లేదా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఖచ్చితంగా ఈ సినిమా ఒక్క మలయాళం ఇండస్ట్రీ నుంచే కాకుండా ఇండియన్ సినిమా నుంచి కూడా ఒక ఆసక్తికర అటెంప్ట్ అని చెప్పవచ్చు. ఈ తరహా కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు దాదాపు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పడం అంటే కష్టమే కానీ దీనిని దర్శకుడు దాదాపు మంచి ఎంగేజింగ్ గానే నడిపించే విధంగా తెరకెక్కించడం బాగుంది.

జెనరల్ మలయాళం థ్రిల్లర్స్ లానే స్లో స్టార్ట్ తో మొదలైన ఈ సినిమా లోతుగా వెళుతున్న కొద్దీ మరింత గ్రిప్పింగ్ గా మారిపోతుంది. ఈ కథనం, స్క్రీన్ ప్లే వచ్చే కొన్ని ట్విస్ట్ లు అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లోని ప్రీఇంటర్వెల్ కి ముందు ఓ సీన్, ఇంటర్వెల్ బ్లాక్ లోని సన్నివేశాలు చూసే వీక్షకుని మైండ్ బ్లాక్ చేయడం గ్యారెంటీ.

అంతే కాకుండా క్లైమాక్స్ పోర్షన్ లో కూడా ఓ ట్విస్ట్ సాలిడ్ గా ఉంది. ఇలా ఓ రేర్ కాన్సెప్ట్ కి తగ్గ సాలిడ్ ఎలిమెంట్స్ ని దర్శకుడు జితూ సతీషన్ అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారు. ఇక నటీనటులు అంతా కూడా మంచి పెర్ఫామెన్స్ లని ఈ సినిమాలో అందించారు. కనిపించిన ప్రతీ నటునికి ప్రాముఖ్యత ఇందులో కనిపిస్తుంది. వారిని చూపిస్తూ అల్లుకున్న కథనం, సీన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా ఒక సాలిడ్ అటెంప్ట్ అయినప్పటికీ మరీ మూవీ లవర్స్, హాలీవుడ్ సినిమాలు ఇంకా ముఖ్యంగా టైం రిలేటెడ్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా బాగానే అనిపిస్తుంది కానీ ఆల్రెడీ చూసిన కాన్సెప్ట్ నే కదా అనిపించక మానదు. ఈ తరహాలో మన తెలుగు నుంచి కూడా ఆరంభం అనే సినిమా ఉంది.

సో తెలుగు ఆడియెన్స్ లో ఈ సినిమా చూసినవారికి ఇది కొత్తగా ఏమి అనిపించకపోవచ్చు. అలానే పలు హాలీవుడ్ సినిమాలు వివరైం, మిడ్ నైట్ మీట్ ట్రైన్ లాంటి సినిమాల ప్రేరణ ఇందులో ఉంది అనిపిస్తుంది. నిజానికి కాన్సెప్ట్ అలాంటిదే కాబట్టి ఈ టైం లూప్ థ్రిల్లర్ అలాంటి సినిమాలని రిఫ్లెక్ట్ చేస్తుంది.

సో మరీ మూవీ లవర్స్ అన్నీ కవర్ చేసిన వారికి ఈ చిత్రం ఓకే అనిపించవచ్చు. కానీ వారికి కూడా మన నుంచి ఓ మంచి అభిప్రాయాన్ని మిగల్చవచ్చు. ఇవి పక్కన పెడితే కొన్ని కొన్ని సీన్స్ జెనరల్ ఆడియెన్స్ అక్కడక్కడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా అక్కడక్కడా కొద్దిగా స్లోగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్యాకెడ్ గా ఈ సినిమా కాన్సెప్ట్ కి తగ్గ విధంగా డిజైన్ చేసుకున్న అంశాలు ఇందులో ఇంప్రెస్ చేస్తాయి. మ్యూజిక్ బాగుంది. కెమెరా వర్క్ కూడా సాలిడ్. ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. హాట్ స్టార్ వారి తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.

ఇక దర్శకుడు జితూ సతీషన్ మంగళతూ విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాలో మెప్పిస్తుంది. చాలా పక్కాగా నీట్ గా తాను డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే ఇందులో హైలైట్ అయితే దానిని తాను చక్కగా తెరపై ఆవిష్కరించడం అనేది తనలోని క్లారిటీ ఫిల్మ్ మేకర్ ని చూపిస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్ సినిమాల నుంచి ప్రేరణ తనలో కలిగి ఉండొచ్చు కానీ ఈ జానర్ లో ఓ సాలిడ్ సినిమాని తాను అందించి మెప్పించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సంభవం అధ్యాయం ఒన్ను’ సినిమా ఈ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలపై బేసిక్ ఐడియా లేని వారికి మాత్రం ఒక రేంజ్ లో థ్రిల్ ట్రీట్ ని అందిస్తుంది. టైం లూప్ కథనంలో వచ్చే పలు ట్విస్ట్ లు, స్క్రీన్ ప్లే ఇందులో ప్రధాన హైలైట్ గా నిలుస్తాయి. అలానే నటీనటులు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. జెనరల్ ఆడియెన్స్ కి కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ సీన్స్, కొంచెం స్లో కథనం పక్కన పెడితే ఈ టైం లూప్ మిస్టరీ థ్రిల్లర్ ఓటిటిలో మంచి ట్రీట్ ఇస్తుంది వాచ్ ఇట్.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు