మాజీ హీరోయిన్ కి కరోనా పాజిటివ్ !

మాజీ హీరోయిన్ కి కరోనా పాజిటివ్ !

Published on Apr 18, 2021 3:00 PM IST

మాజీ హీరోయిన్ సమీరా రెడ్డి కొన్నేళ్ల నుండీ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం తరుచూ కనిపిస్తూ.. బాగానే హడావుడి చేస్తోంది. అయితే తాజాగా ఆమెకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని ఆమె అధికారికంగా తెలిపారు. ఇక సమీరాతో సన్నిహితంగా ఉన్న మిగిలిన వాళ్లు కూడా క్వారెంటెన్ లోకి వెళ్లారు. ఏది ఏమైనా వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది.

కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ పెద్ద సమస్య అయిపోయింది. పైగా స్టార్స్ కు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో మేకర్స్ కి ఏం చేయాలో అర్ధం కావడంలేదు. మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సిందేనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆలియా భట్ కి, రణ్ బీర్ కపూర్ కి, నివేతా థామస్ కి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే నిన్న విలన్ సోనూసూద్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు