‘సమ్మతమే’ నుంచి ‘కృష్ణ అండ్ సత్యభామ’ మొదటి సింగిల్ !

Published on Nov 29, 2021 12:00 pm IST

యంగ్‌ హీరో కిరణ్‌ అబ‍్బవరం హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘సమ్మతమే’. అర్బన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ‍్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా రానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీమ్ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. అందులో భాగంగానే ‘కృష్ణ అండ్ సత్యభామ’ మొదటి సింగిల్ లిరికల్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు.

శేఖర్‌ చంద్ర ట్యూన్, కృష్ణకాంత్ సాహిత్యం ఆకట్టుకున్నాయి. యాజీన్‌ నజీర్‌, శిరీషా భాగవతుల ఆహ్లాదకరమైన గానంతో చక్కగా పాడారు. ఈ పాటలో కృష్ణుడు, సత్యభామల ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో చూపించారు. కిరణ్‌, చాందినీ చౌదరీల రొమాంటిక్‌ ట్రాక్‌ చూడముచ్చటగా అనిపిస్తుంది. యూజీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కె. ప్రవీణ్‌ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :