సమ్మోహనం 3రోజుల కలక్షన్స్ !

సమ్మోహనం 3రోజుల కలక్షన్స్ !

Published on Jun 21, 2018 2:00 PM IST

మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు , అదితి రావ్ హైదరి జంటగా నటించిన చిత్రం సమ్మోహనం .ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూస్ ని సొంతం చేసుకొని దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది . ఇక మొదటి మూడు రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3. 9 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

ఈ వారం కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ నే రాబడుతుంది చాలా రోజుల తరువాత సుధీర్ బాబు ఈ చిత్రం తో పెద్ద విజయాన్ని సాధించారు . రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈచిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు