క్లీన్’యు’సర్టిఫికెట్ తో రానున్న సమ్మోహనం !
Published on Jun 7, 2018 11:20 am IST

సుధీర్ బాబు , అదితిరావు హైదరి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సమ్మోహనం.ఈ చిత్రానికి సెన్సార్ క్లీన్ ‘యు’సర్టిఫికెట్ ఇచ్చింది . దాంతో ఈనెల 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ సినిమా.

ఇక జూన్ 10 న హైదరాబాద్ లో జె ఆర్ సి కన్వెన్షన్లో జరిగే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా రానున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరో సుధీర్ బాబు ఈ చిత్రం ఫై చాలా ఆశలే పెట్టుకున్నాడు దీనికోసం ఎన్నడూ లేనివిధంగా జోరుగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ లంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook