సామీ స్క్వేర్ విడుదల తేదీ ఖరారు !

Saamy

చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబూ తమీన్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలకానుంది.

ఇక ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం ఫై కావ్య వేణుగోపాల్ , బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.

Exit mobile version