సంపత్ నంది కొత్త చిత్రానికి లైన్ క్లియర్ !

సంపత్ నంది కొత్త చిత్రానికి లైన్ క్లియర్ !

Published on Jan 31, 2019 11:53 PM IST


‘గౌతమ్ నంద’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది. గోపిచంద్ నటించిన ఈ చిత్రం 2017లో విడుదలై బాగుంది అనిపించుకున్న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇక తాజాగా సంపత్ నంది మళ్ళీ తన కొత్త చిత్రాన్ని గోపిచంద్ తోనే చేయనున్నాడు. ఇటీవల గోపిని కలిసి ఫైనల్ నరేషన్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. ఆ తరువాత వెంటనే గోపిచంద్ కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చాడట. ఈచిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారు అనే వివరాలు తెలియాల్సి వుంది.

ఇక గోపిచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు. అన్ని కుదిరితే ఈ రెండు చిత్రాలు కూడా ఇదే ఏడాది లో విడుదలకానున్నాయి. మరి ఇటీవల వరస పరాజయాలతో సతమత మవుతున్న గోపిచంద్ ఈ రెండు చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు