‘ఎర్రబస్సు’ ఆడియోకి బర్నింగ్ స్టార్ యాంకరింగ్.

‘ఎర్రబస్సు’ ఆడియోకి బర్నింగ్ స్టార్ యాంకరింగ్.

Published on Oct 31, 2014 2:40 PM IST

erra-bus
దర్శకరత్న దాసరి నారాయణరావు, మంచు విష్ణు తాతా మనవళ్ళుగా నటించిన సినిమా ‘ఎర్రబస్సు’. ఈ రోజు సాయంత్రం సినిమా ఆడియో విడుదలవుతుంది. ఈ కార్యక్రమానికి బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు యాంకరింగ్ చేయనున్నారు. ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత సుమతో కలసి ఆహుతులను, ప్రేక్షకులను అలరించడానికి సంపూ సిద్దమయ్యారు. ‘హృదయ కాలేయం’ సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన సంపూర్నేష్ బాబు యాంకరింగ్ ఎలా చేస్తాడో అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

‘ఎర్రబస్సు’ చిత్రానికి చక్రి స్వరాలను అందించారు. దాసరి చిత్రానికి చక్రి సంగీతం అందించడం ఇదే మొదటిసారి. విష్ణు సరసన కేథరిన్‌ త్రేసా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, కృష్ణుడు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దాసరి దర్శకత్వం వహిస్తున్న 151వ సినిమా ఇది. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. నవంబర్ 14న సినిమా విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు