పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సంపూ “బజార్ రౌడీ”.!

Published on May 8, 2021 5:00 pm IST

తన మొదటి సినిమా “హృదయ కాలేయం”తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “బజార్ రౌడీ”.మరి ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నట్టు తెలుస్తుంది.. ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.

శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొద‌టి సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. 1000 సినిమాలకు పైగా ఎడిటింగ్ చేసిన సీనియర్ ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ సినిమాకి పనిచేశారు.

SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే ఈ బ‌జార్‌ రౌడీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ క‌ష్టం వ‌చ్చినా త‌న‌వంతుగా స‌హ‌య కార్య‌క్ర‌మాల ద్వారా స‌హ‌య‌ప‌డే బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పుట్టిన‌రోజు ( మే 9న ) సంద‌ర్బంగా అభిమానులు స‌హ‌య కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :