చిరు పుట్టిన రోజు సందర్భంగా విడుద‌ల కి సిద్ద‌మ‌వుతున్న బ‌ర్నింగ్ స్టార్ “బ‌జార్ రౌడి”

చిరు పుట్టిన రోజు సందర్భంగా విడుద‌ల కి సిద్ద‌మ‌వుతున్న బ‌ర్నింగ్ స్టార్ “బ‌జార్ రౌడి”

Published on Aug 11, 2021 5:05 PM IST

హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి కామెడి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న అభిమానులుగా మార్చుకున్న బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా, కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈ సినిమా ని సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వ‌రావు తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ట్రేడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మ‌హేశ్వ‌రి వ‌ద్ది న‌టిస్తున్నారు. ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సంపూ మార్క్ తో ఈ చిత్రం ఆద్యంతం న‌వ్వుల‌తో వుండేలా ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వారావు స్క్రీన్ మీద త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ని చూపించడం జరిగింది. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 20 న మెగాస్టార్ చిరంజీవి గారి జ‌న్మ‌దినోత్స‌వం సంధ‌ర్బంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత సంధిరెడ్డి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, ఈ చిత్ర క‌థ కి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా చిత్రాన్ని తీర్చిదిద్దారు అని అన్నారు. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రావు త‌నకున్న అనుభ‌వాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చాడు. షియాజి షిండే, పృథ్వి, నాగినీడు,ష‌ఫి, స‌మీర్ లాంటి పెద్ద న‌టీన‌టుల‌ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించామని అన్నారు. జాషువా మాస్ట‌ర్ ఫైట్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటాయి, అలాగే ఇప్ప‌టి దాకా విడుద‌ల చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భించిందని అన్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 20 న చిరంజీవి గారి పుట్టిన‌రోజు సంధ‌ర్బంగా విడుద‌ల చేస్తున్నాము అని అన్నారు

ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వ‌రావు మాట్లాడుతూ, ఈ చిత్ర అవ‌కాశాన్ని తనకిచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు కి, నిర్మాత శ్రీనివాస‌రావు గారికి ప్ర‌త్యేఖ ద‌న్య‌వాధాలు తెలిపారు. బ‌ర్నింగ్ స్టార్ గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో వున్న సంపూ ని ఇలాంటి ప‌క్కా క‌మ‌ర్షియల్ క‌థ‌లోని ఆయ‌న స్టైల్ ని యాడ్ చేసి తెర‌కెక్కించామని అన్నారు. ప్రేక్ష‌కుల కి న‌వ్వులు, పాట‌లు, ఫైట్స్ కిక్కిచ్చే అన్ని హంగుల‌తో, అంద‌రి స‌హ‌య స‌హ‌కారాలతొ ఈ చిత్రాన్ని పూర్తి చేసాము అని అన్నారు. ఇటీవలే మా మోద‌టి కాపి చూసిన నిర్మాత చాలా ఆనందంగా వున్నారు అని, సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 20 న‌ ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తున్నామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారంటే సంపూర్ణేష్ బాబు కి చెప్ప‌లేనంత అభిమానం అన్ని విష‌యం అంద‌రికి తెలిసిందే, ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఆనంద‌గా వుందని, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు