సోలో హీరోగా 3 సినిమాలకు సంపూర్నేష్ బాబు గ్రీన్ సిగ్నల్..

సోలో హీరోగా 3 సినిమాలకు సంపూర్నేష్ బాబు గ్రీన్ సిగ్నల్..

Published on Feb 21, 2015 8:55 PM IST

sampurnesh
‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన సంపూర్నేష్ బాబుకు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇంటర్నెట్ ప్రపంచంలో అతని అభిమానుల సంఖ్య ఎక్కువే. అతనితో సినిమా తీయడానికి పలువురు దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. అయితే, తన వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు.

ప్రస్తుతం దర్శకుడు స్టీవెన్ శంకర్ కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించిన ‘కొబ్బరిమట్ట’, మంచు విష్ణు నిర్మిస్తున్న ‘సింగం 123’ సినిమాలలో హీరోగా నటిస్తున్నారు. ఇవి కాకుండా సోలో హీరోగా మరో మూడు సినిమాల్లో నటించడానికి సంపూర్నేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

సంపూర్నేష్ బాబు కీలక పాత్రలో నటించిన ‘బందిపోటు’ రెండు రోజుల క్రితం విడుదలైంది. అతని పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు