సంపూ విజయయాత్రలు మొదలుపెట్టారుగా…!

Published on Aug 17, 2019 8:45 am IST

అష్ట అవాంతరాలను దాటుకొని, ఎట్టకేలకు మూడేళ్ళ తరువాత థియేటర్లలోకి దిగిన కొబ్బరి మట్ట హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంపూర్ణేష్ బాబు తన మార్కు డైలాగులు, డాన్స్ లతో ప్రేక్షకులకు కావలసినంత హాస్యం పంచాడు. పాపారాయుడు,పెదరాయుడు,యాండ్రాయుడు అనే మూడు విభిన్న గెటప్స్ లో సంపూ చంపేశారు. ముఖ్యంగా ఆయన చెప్పిన మూడున్నర నిమిషాల వరల్డ్ రికార్డు డైలాగ్ మూవీకి మంచి ప్రచారం కల్పించింది. వసూళ్ల పరంగా కూడా కొబ్బరిమట్ట ఊహించని ఫిగర్స్ అందుకుంటుందని సమాచారం.

కాగా ఈ మూవీకి వస్తున్న స్పందన దృష్ట్యా సంపూర్ణేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో నేడు రేపు విజయయాత్రలు చేయనున్నారు. కొబ్బరిమట్ట ప్రదర్శించబడుతున్న ఆయా థియేటర్లకు వెళ్లి నేరుగా అభిమానులను కలవనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నీలం నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు స్టీవ్ శంకర్ సమకూర్చడం జరిగింది.

సంబంధిత సమాచారం :