కామెడీస్టార్ మూవీ విడుదలకు మోక్షం కలిగింది.

Published on Jun 20, 2019 9:08 am IST

“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు సంపూర్ణేష్ బాబు, ముద్దుగా మూవీ లవర్స్ “సంపూ” అని పిలుచుకుంటూ ఉంటారు. నవ్వుతెప్పించే ఫిజిక్ తో మాస్ హీరో రేంజ్ డైలాగ్స్ ,యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం సంపూ స్టయిల్. హృదయ కాలేయం తరువాత ‘సింగం 123’ విడుదల చేసిన ఈయన తదుపరి చిత్రంగా “కొబ్బరి మట్ట” అనే మూవీ కి సంబందించిన టీజర్స్,పాటలతో సందడి చేశాడు, కానీ కారణాలేమిటో తెలియదు కాని, ఆ మూవీ థియేటర్లలో కి రాలేదు.
ఐతే తాజాగా ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు సంపూర్ణేష్ బాబు నిన్న ప్రకటించాడు. నేడు జూలై 19న విడుదల చేస్తున్నట్లు తన ట్విటర్ ఖాతాలో మూవీ పోస్టర్ ని పోస్ట్ చేశాడు. ఎప్పటినుండో ‘కొబ్బరి మట్ట’ కోసం ఎదురు చూస్తున్న సంపూ అభిమానులకు, హాస్యప్రియులకు ఆయన నవ్వులు పంచడానికి రెడీ అయ్యారు. ఇషికా సింగ్,షకీలా,కత్తి మహేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More