పవన్ “వినోదయ సితం” రీమేక్ పై సముద్ర ఖని కీలక వ్యాఖ్యలు!

Published on May 13, 2022 2:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ఒక పక్క హరిహర వీరమల్లు చిత్రం ను పూర్తి చేస్తూనే, నెక్స్ట్ హరీష్ శంకర్ చిత్రం కోసం సన్నాహం అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిందే. దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రం పై సముద్ర ఖని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

వినోదయ సీతం రీమేక్ కి సముద్ర ఖని దర్శకత్వం వహించనున్నారు. ఆయనకు నేను ఫ్యాన్ ను, ఒక పక్క ఫ్యాన్ గా ఉంటూనే, మరొక పక్క ఆయనను డైరెక్ట్ చేస్తా చూడండి అంటూ చెప్పుకొచ్చారు. సముద్ర ఖని చేసిన వ్యాఖ్యల తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర ఖని తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లో విలన్ రోల్ లో నటించారు. పలు తెలుగు చిత్రాల్లో నటించి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటుడు, పవన్ ను ఎలా డైరెక్ట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :