‘పందెంకోడి 2’ అక్కడ బాగానే రాబడుతుంది !

‘పందెంకోడి 2’ అక్కడ బాగానే రాబడుతుంది !

Published on Oct 19, 2018 5:59 PM IST

తమిళ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘సండకోళి 2’ నిన్న విడుదలై తమిళ ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం మొదటి రోజు తమిళనాడు వ్యాప్తంగా రూ. 5.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విశాల్ కెరీర్ లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం.

రూరల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అక్కడి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. దాంతో ఈచిత్రం మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను సాధించనుందట. ఇక ‘పందెంకోడి 2’ పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రానికి బి, సి సెంటర్ల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు