రామ్ గోపాల్ వర్మ ‘వీరప్పన్’ ఇతడే..!

Killing-Veerappn
ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో వివాదాస్పద నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే! రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్’ రూపొందుతోంది.

వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తున్నారు. ఇక వీరప్పన్‌గా రామ్ గోపాల్ వర్మ ఓ థియేటర్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేయడం విశేషం. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్‌’లో వీరప్పన్‌గా నటిస్తున్నారు. వీరప్పన్ లుక్స్, మ్యానరిజం ఇలా అన్నింటినీ తెలుసుకొని ఆ పాత్రలో సందీప్ ఒదిగిపోయి నటిస్తున్నాడని వీరప్పన్ ఎలా ఉండనున్నాడనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తూ వర్మ తెలిపారు.

ఇక ఈమధ్యే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందని వర్మ తెలియజేశారు.

Exit mobile version