సందీప్ కిషన్ “గల్లీ రౌడీ” థియేటర్ల లోనే..!

Published on Jul 8, 2021 11:54 am IST

జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల విషయం లో నటుడు సందీప్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్లీ రౌడీ ఫన్ మసాలా ఎంటర్ టైనర్ అంటూ చెప్పుకొచ్చారు. థియేటర్ల లో చూడాల్సిన సినిమా అని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలకు మద్దతు గా ఉండేందుకు ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే విడుదల తేదీ కోసం ఎదురు చూడండి అంటూ చెప్పుకొచ్చారు.

అయితే తమకు మద్దతుగా నిలిచిన కొన వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలిపారు సందీప్. ఈ చిత్రం లో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, సింహ, హర్ష లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చౌరస్తా రామ్ సంగీతం అందిస్తుండగా, ఎంవీవీ సినిమాస్ పతాకంపై ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓటిటి ద్వారా విడుదల అవుతుంది అంటూ వచ్చిన వార్తల పై సందీప్ కిషన్ క్లారిటీ ఇవ్వడం తో ఇక అభిమానులు థియేటర్ల లో సినిమా కోసం వేచి చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :